Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండలం చింతలపల్లి వాస్తవ్యులు శ్రీ కొప్పుల గంగాధర్ రావు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి 16200 రూపాయలు విరాళంగా అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు వారికి హృదయపూర్వక అభినందనలు.ఈ విరాళం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు,విద్యార్థుల భవిష్యత్తుపై ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనం అని కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు తెలియచేశారు.కొప్పుల గంగాధర్ రావు తమ సామాజిక బాధ్యతను గుర్తించి, విద్యార్థుల క్షేమం కోసం ముందుకు వచ్చారు.ఈ విరాళం విద్యార్థులకు ఒక రకమైన ప్రోత్సాహం. తమ చదువుపై మరింత శ్రద్ధ చూపించడానికి వారిని ప్రేరేపిస్తుంది. కొప్పుల గంగాధర్ రావు ఈ విరాళం, సమాజంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని కళాశాల సీనియర్ అధ్యాపకురాలు బండి విజయనిర్మల మరియు అధ్యాప కేతర బృందం కొనియాడుతూ ధన్యవాదాలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవరావు,అధ్యాపకురాలు విజయనిర్మల,మామిండ్ల బుచ్చిరెడ్డి,రాజ్ కుమార్,సుధీర్ కుమార్,నాగరాజు,అనిల్ కుమార్,కుమారస్వామి, యాకసాయిలు,చిరంజీవి,అక్రమ్ అలీ,పద్మ,రమాదేవి, సదయ్య,లక్ష్మి,సంగీత,మరియు విద్యార్తిని,విద్యార్థులు పాల్గొన్నారు.