HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పసునూటి ఆనంద్ బొజ్జ సురేష్ ఉండిలా మల్లికార్జున్ పడాల శ్రీకాంత్ సంగెం కళాశాలలో విద్యార్థులందరికి 6 వేల రూపాయల ప్యాడ్స్‌ను విరాళంగా ఇచ్చారు. పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థులు సంగెం కళాశాల కు మంచి పేరు తీసుకు రావాలని ఎగ్జామ్స్ ప్యాడ్స్ ని విరాళంగా ఇచ్చారు అని ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవ రావు పేర్కొన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయులు పసునూటి ఆనంద్ గారు 2024-25 అకాడమీక్ సంవత్సరానికి పబ్లిక్ ఎగ్జామ్స్ లో కళాశాల కి టాపర్ గా వచ్చిన విద్యార్థులకు మొదటి బహుమతి 2116/- ద్వితీయ బహుమతి 1116/- గా ప్రకటించి ఇట్టి రూపాయలను ప్రిన్సిపాల్ గారికి అందించారు ఈ ప్యాడ్స్‌తో విద్యార్థులు తమ పరీక్షలకు మరింత సిద్ధంగా ఉండగలుగుతారు. విద్యార్థులు ఈ విరాళాన్ని ఆనందంతో స్వీకరించారు. అని దాతలను కళాశాల బృందం కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవరావు , సీనియర్ అధ్యాపకురాలు విజయనిర్మల గ్రంధపాలకులు రాజ్ కుమార్, సుధీర్ కుమార్,అధ్యాపకులు మామిండ్ల బుచ్చిరెడ్డి, నాగరాజు,అనిల్ కుమార్,కుమారస్వామి, యాకసాయిలు,రాఖీ,మాధవి, పద్మ, రమాదేవి, సదయ్య,లక్ష్మి, సంగీత, మరియు విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు.