Search
Close this search box.

శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం

అవమానించిన వ్యక్తి         అవమానపడ్డ వ్యక్తి 

Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా:  సంగెం మండలం గుంటూరు పల్లి గ్రామంలో శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం అనంతరం సాయంత్రం గ్రామంలో, రామ,లక్ష్మణ,సీత సహిత ఆంజనేయ స్వామిని గ్రామంలో వూరేగింపుగా మేళ తాళాలతో వీధి వీధి తిప్పుతూంటారు….అలా తిప్పే క్రమంలో పాయసం మరియు ఫల హారాలు పంచుతారు…అవి పంచె వారిలో ఒక బీసీ మంగళి కులస్తుడు జంపాలా దుర్గయ్య అనే వ్యక్తి కూడా ఉన్నాడు.కాగా కొంగర భాస్కర్ రావు అనే వ్యక్తి తాము అగ్రవర్ణము వారిమని తమకు మంగలి వారు ప్రసాదాలు పెట్టడం ఎంటి అని అసభ్య పదజాలంతో పచ్చి బూతులతో రెచ్చిపోయి మీది మీదికి పొయ్యి స్వామి వారి శోభాయాత్రను సైతం ఆపి గొడవకు దిగాడు…కాగా అక్కడ ఉన్న మిగతా గ్రామస్థులు కొంగర భాస్కర్ రావుని మందలించి ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుదాము అని ఆ స్వామివారి శోభాయాత్రలో దుర్గయ్యకి భరోసా ఇచ్చి పంపినారు….కాగా జరిగిన విషయం తమ కుటుంబ సభ్యులకు బీసీ వర్గానికి చెందిన మంగలి దుర్గయ్య చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు ఆ తర్వాత రోజున గ్రామ పెద్దలను ఆశ్రయించి నన్ను తక్కువ జాతి వాడినని కొంగర భాస్కర్ రావు నన్ను అవమానపరిచాడని తమకు న్యాయం చేయమని వేడుకోవడం జరిగింది….గ్రామ పెద్దలు కొంగర భాస్కర్ రావుని పిలిపించిగా తనకి రావాల్సిన అవసరం లేదని తనని అడిగే హక్కు గ్రామ పెద్దలకు లేదని కొత్త సర్పంచిని ఎన్నుకున్న తర్వాత మాట్లాడుదాం అని చెప్పాడని గ్రామస్థుల కథనం…కాగా రాష్ట్ర ప్రభుత్వం జై భీమ్,జై బాపు,జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు పాదయాత్ర చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొంగర భాస్కర్ రావు ఇలా కుల దూషణ చేయడం సరి కాదని గతములో కూడా బుడగ జంగాల కాలానికి చెందిన ఒక వ్యక్తిని కూడా కుల దూషణ చేసి బాగా కొట్టాడు అని తెలిసింది. సదరు కొంగర భాస్కర్ రావు మీద ప్రజా సంఘాలు ఆవేశం వ్యక్తం చేస్తున్నాయి.ఏది ఏమైనా మంగలి వర్గానికి చెందిన దుర్గయ్య తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను వేడుకుంటున్నారు…పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం
పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం
పురుషోత్తం రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్