•అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన రమాదేవి
•దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ కైవసం
•దేశం పేరు నిలబెట్టిన చింతలపల్లి యువతి
Hm9న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండలం లోని చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి కాంబోడియా దేశంలో జరుగుతున్న పారా త్రో బాల్ పోటీలలో శుక్రవారం బంగారు పతకం సాధించింది. కాంబోడియా దేశంలోని నేషనల్ పారాలింపిక్ కమిషన్ నిర్వహించిన ఈ పోటీలలో సంగెం మండలం లోని చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీలలో బంగారు పతకం సాధించింది. దీంతో చింతలపల్లి గ్రామంతో పాటు సంగెం మండల వాసులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ సిసి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బొజ్జ సురేశ్ మాట్లాడుతూ బంగారు పతకాన్ని సాధించి దామెరుప్పుల రమాదేవి ఆమెను ప్రోత్సహిస్తూ, మోటివేషన్ చేస్తూ, ప్రేరణ చేస్తూ తన కౌన్సిలింగ్ ద్వారా భారత దేశానికి పేరు తీసుకొచ్చినందుకు రమాదేవి మరియు తన టీమ్ కు శుభాకాంక్షలు ,దేశం గర్వపడేలా చేసిందని హర్షం వ్యక్తం చేశారు.