hm9 న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా: హసన్ పర్తి రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసివున్న దిచక్ర వాహనాలే లక్ష్యంగా చొరీలకు పాల్పడుతున్న నిందితుడుని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 10లక్షల విలువ గల 18 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి కాజీపేట ఏసిపి తిరుమల్ వివరాలను వెల్లడిస్తూ ఈ రోజు ఉదయం హసన్‌పర్తి పోలీసులు హసన్‌పర్తి మండల కేంద్రంలో వాహన తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి పోలీసుల నిర్వహిస్తున్న తనీఖీలను గమనించి అక్కడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని వద్ద ద్విచక్ర వాహనానికి సంబంధించి ఎలాంటి అధారాలు లేకపోవడం పోలీసులు నిందితుడుని విచారించగా జనగామ జిల్లా, చిలుపూర్ మండలం, ఫతేపూర్ గ్రామం, ప్రస్తుతం హనుమకొండ, గోపాల్‌పుర్‌లో నివాసం వుంటున్న గుగులోత్ చందు లాల్ (24), గత కొద్ది రోజులుగా తనకు డ్రైవింగ్ లైసెన్స్ లేనందున స్నేహితుడి లాగిన్ ఐడీతో జోమాటో, స్విగ్గీ, ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్నాడు. వీటీ ద్వారా వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయిస్తే వచ్చే డబ్బు జల్సాలు చేయాలకున్నాడు నిందితుడు. ఇందులో నిందితుడు తాను అనుకున్న ప్రకారం హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 7, హసనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కెయూసి పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేయడంతో పాటు నిందితుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పరిధిలొ4, భువనగిరిలో2, హైదరాబాద్‌లో 1 చోప్పున మొత్తం 18 ద్విచక్ర వాహనాలను చోరీ చేసాడు. నిందితుడు చోరీ చేసిన వాహనాలను అవకాశం చూసుకోని విక్రయించేందుకు తన భద్రపర్చుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడి ఇంటి చోరీ అయిన ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసిపి వెల్లడించారు నిందితుడిని పట్టుకొని చోరీకి గురైన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, ఏసిపి తిరుమల్, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్ చేరాలు, ఎస్.ఐలు దేవేందర్, రవి, సిద్దయ్యలు, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ వివేకనంద, కానిస్టేబుళ్ళు క్రాంతికుమార్, తిరుపతయ్య, భరత్‌కుమార్, దేవేందర్, మహేందర్, రమేష్, పూర్ణచారీ, రాజ్‌కుమార్, సొమన్న, ధనుంజయ, నాగరాజు, నవీన్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.