వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందజేసింది. FNCC అధ్యక్షులు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.