వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ గారు ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు.