వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి నారాయణ విద్యా సంస్థల తరఫున 2.5 కోట్ల రూపాయల విరాళం అందజేశారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పొంగూరు సింధూర, పొంగూరు శరణి, ప్రసిడెంట్ కె. పునీత్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గారిని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును అందించారు.