వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయల విరాళం అందించింది.
భారత్ బయోటెక్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.