వరద బాధితుల సహాయార్థం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేసింది. బ్యాంకు చైర్మన్ వై.శోభ గారు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బ్యాంకు ప్రతినిధులను అభినందించారు.