వరద బాధితుల సహాయార్థం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శంకర సుబ్రమణియన్ గారు, సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆమేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగారు వారిని అభినందించారు.