వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన మహేశ్ బాబు గారు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (AMB) తరపున కూడా మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్ గారి వెంట సతీమణి నమ్రత గారు కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు.