లింగంపేటలోని నాగన్న బావిని, తాండూర్ లోని శివాలయాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నాగన్న బావి పునరుద్ధరణ పనులను శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. నాగన్న బావి ప్రాముఖ్యతను ప్రొజెక్టర్ ద్వారా చూశారు. నాగన్న బావి పునః ప్రారంభం చేసిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇన్ఫోసిస్ సమస్త నాగన్న బావి అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ లింగంపేట మండల కేంద్రాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.