Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: గిసుగొండ మండలం గంగాదేవి పల్లి గ్రామంలో లక్కమారి కాపు సంఘం భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్క మారి కాపు వారు వ్యవసాయ ఆధారిత కుటుంబాలపై జీవిస్తున్నారని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. లక్కమారి కాపు సంఘం ఫెడరేషన్ కి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సహకరిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని కులాలను ప్రోత్సహిస్తుందన్నారు