వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
HM9న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ, చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులకతో పాటు రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణిచివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షాలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ శుక్రవారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపిలు,అదనపు డిసిపి,ఎసిపిలు,ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ,డివిజినల్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, అస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రొడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసంఏవిధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. ఈ సమావేశంలో నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకొవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు, అధికారులకు పొలీస్ కమిషనర్ పలుసూచనలు చేస్తూ పెండిరగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొవాల్సి వుంటుందని. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, నిజాయితీగా పనిచేయాలని, సివిల్ పంచాయితీలకు దూరంగా వుండాలని, తప్పుడు కేసు నమోదు చేయవద్దని, పోలీసులు అప్రమత్తంగా లేకుంటే శాంతి భద్రతలు అదుపు తప్పుతుందని. ప్రధానంగా ముందస్తూ సమాచారంతో పాటు, రౌడీ షీటర్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమచారం సేకరించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో డిసిపిలు రాజమహేంద్రనాయక్, రవీందర్, ఏఎస్‌పి మనాన్ భట్, అదనపు డిసిపి రవితో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.