HM9NEWS ప్రతినిధి వరంగల్ జిల్లా సంగెం మండలం: ఆశాలపల్లి గ్రామానికి చెందిన జనగాం ప్రభాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు శనివారం ఎల్గూర్ రంగంపేటలో తన అక్కయ్య ఇంటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తుండగా సంగెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల దగ్గర అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 లో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి జనగాం ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.