రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముర్ము గారికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు శ్రీ జి.కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క స్వాగతం పలికారు.
నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గద్వాల, ప్రభుత్వ సలహాదారు (ప్రొటొకాల్) శ్రీ హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ జితేందర్, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.