రిటైర్డ్ తహసీల్దారు ప్రొద్దుటూరు చంద్రసేనా రెడ్డి గారు తన నెల రోజుల పెన్షన్ రూ. 89,232 ను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు వీరికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.