HM9NEWS వరంగల్ జిల్లా: భద్రకాళి బండ్,మాడ విధులను మంత్రి,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పరిశీలన కార్యక్రమం లో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోసెస్ ఆనంద్ కుమార్ వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమాచార,రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఆదివారం రోజు వరంగల్ హంటర్ రోడ్డు లోని భద్రఖాళీ బండ్ ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,వర్దన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు KR నాగరాజు,ఎమ్మెల్సి శ్రీ బస్వారాజు సారయ్య,మేయర్ గుండు సుధారాణి,జిల్లా కలెక్టర్ లు ప్రవీణ్య,సత్య శారదా లతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోసెస్ ఆనంద్ కుమార్ పరిశీలించారు భద్రకాళి బండ్ ఆవరణలో కలియ తిరిగిన మంత్రి, ఇరిగేషన్,KUDA అధికారులతో చెరువు పూర్తి విస్తీర్ణం చేయాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం శ్రీ భద్రఖాళీ అమ్మవారిని దర్శించికుని,మాడ విధుల పనుల పురోగతిని పరిశీలించారు.ఆలయ అర్చకులు మంత్రి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు EV శ్రీనివాస్ రావు,కార్పొరేటర్లు మామిండ్ల రాజు,పోతుల శ్రీమాన్,ప్రజా ప్రతినిధులు,జిల్లా ముఖ్య నాయకులు,ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.