సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి వివరాల సేకరణతో అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు.
ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ గారితో పాటు ఇతర అధికారులు గవర్నర్ గారి వివరాలను నమోదు చేశారు.