మంగళవారం – తేది 24-9-2024
సి.ఏం.ఆర్. బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట లోని శంకధార రైస్ మిల్లు ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైసెమిల్లు కు కేటాయించిన వరి ధాన్యం ను తొందరగా సి.ఏం.ఆర్. సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పేటాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్, రాజంపేట తహసీల్దార్ అనిల్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
..జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది.