HM9 న్యూస్ రాఖీ పౌర్ణమి ప్రత్యేక కథనం….
ఆగస్టులో వచ్చే శ్రావణ మాస పౌర్ణమిని రాఖీ పౌర్ణమి గా పిలుస్తారు. శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి అంగడిలోనూ రాఖీలు కనబడతాయి. రక్తసంబంధం లేకున్నా, కుల మతాలు ఒకటి కాకున్న సోదర భావం అనే ఒకే ఒక బంధానికి రాఖీ పండగ ఒక నిదర్శనం.1905 బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రజలందరూ ఒకటి అయ్యేందుకు రక్ష బంధాన్ని ఒక ఉద్యమంల నిర్వహించేవారు. రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే వీరులకు విజయం దక్కాలని స్త్రీలు రక్షాబంధనలు చేతికి కట్టేవారు. పురాణాలలో కూడా రక్షాబంధన పండగకి ఒక ప్రత్యేక కథనం ఉంది. లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టినట్లుగా,కృష్ణుడికి, ద్రౌపతి కూడా రక్షాబంధన్ అందించినట్లుగా చెబుతుంటరూ. పురాణాలలోనే కాదు చరిత్రలో కూడా రాఖీ పండగకి ప్రత్యేక స్థానం ఉంది.మన దేశం పైన అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు అతన్ని పురుషోత్తం మూడు అనే రాజు అలెగ్జాండర్ ని ఎదుర్కొన్నాడు. రోజులు గడిచే కొద్ది యుద్ధంలో పురుషోత్తముడు అనే రాజు దే పై చేయి కనిపించింది. రాజు చేతిలో అలగ్జాండర్ చనిపోవడం అని అందరూ అనుకున్నారు ఈ విషయం తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్స్ నా పురుషోత్తముడికి ఒక రాఖిని పంపిందని చెపుతుంటారు. దాంతోపాటు యుద్ధంలో నా భర్తని చంపవద్దని వేడుకుంటుంది. తరవాత యుద్ధంలో అలెగ్జాండర్ ని చంపే అవకాశం ఉన్నా కానీ పురుషోత్తముడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని చెపుతుంటారు.కానీ ఈ విషయాన్ని ద్రువీకరించినందుకు ఎలాంటి ఆధారాలు లేవు.కానీ మొగల్ రాజ్ ఉమాయన్ రాఖీ బంధానికి కట్టుబడిన విషయం రాజస్థాన్ చరిత్రలో వినిపిస్తుంది 15 వ శతాబ్దంలో రాజస్థాన్ లోని చితోడు ప్రాంతాన్ని కర్ణవాటి అనే రాణి పాలించేది.ఒకసారి ఆమె మీదకు బహుదర్ష అనే శత్రువు దండయాత్ర కి వచ్చాడు అతన్ని తన శాయశక్తుల ఎదుర్కొంటూనే సాయానికి రమ్మంటూ అప్పటి మొగల్ రాజు ఉ మాయంకు రాఖీని పంపిందంట కర్ణవాటి రాణి దాని అందుకున్న వెంటనే ఉమాయాన్ తన సైన్యాన్ని చిత్తోడు వైపు మళ్ళించాడు. ఆ యుద్ధంలో హుమాయంన్, కర్ణవాటి రాణి కాపాడలేకపోయినా బహుదర్ ష ని ఓడించగలిగాడు. అప్పటినుండి పురాణాల ప్రకారం రాఖీ పౌర్ణమి రోజున ఉదయం నిద్ర లేచి, తల స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని అక్క చెల్లెలు అంతా అన్నదమ్ములందరికీ రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పుడు తిలకం పెట్టి ఒక సోత్రాన్ని హారతి ఇచ్చుకుంటూ పాడుతారు. రాఖీ కట్టిన అక్క చెల్లెళ్లకు తమ ప్రేమకు గుర్తుగా చక్కటి బహుమతులు అందజేస్తారు.
ఇట్లు
నీరుడి బాల్రాజ్
Hm9 న్యూస్ ఎడిటర్