యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రసంగించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు
అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో జరిగిన 43వ ఇన్నోవేషన్ ఫోరమ్ “గ్రామీణాభివృద్ధికి వ్యూహాలు – ప్రజా సేవలో విశ్వాస ఆధారిత విలువల ప్రభావం” అంశంపై ప్రసంగించడానికి వక్తగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారిని ఆహ్వానించడం జరిగింది..
గత కొద్ది రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గారు లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
ఆదివారం రోజు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో జరిగిన ఈ ఇన్నోవేషన్ ఫోరమ్ లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..
జుక్కల్ నియోజకవర్గ స్థితి గతులపై ఒక షార్ట్ వీడియోను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ అంతర్జాతీయ వేదికపై నియోజకవర్గ పరిస్థితులను గురించి వివరించారు..
ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు,వ్యాపారవేత్తలు, మేధావులు,వైద్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు..
ఎమ్మెల్యే అయిన అతి కొద్ది రోజుల్లోనే ఇలాంటి అరుదైన గొప్ప అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..