Search
Close this search box.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

Hm9న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా: మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా NSF ముందుకు వెళ్తుంది.NSF ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తయారుచేసిన జంగ్ సైరన్ వాల్ పోస్టర్లు విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ VC ప్రతాభ్ రెడ్డి యువత,విద్యార్థుల మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజానికి దగ్గరగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాభ్ రెడ్డి అన్నారు, సోమవారం రోజున నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF) రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ పటేల్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రూపొందించిన జంగ్ సైరన్ వాల్ పోస్టర్లను VC చేతుల మీదుగా విడుదల చేశారు, ఈ సంధర్భంగా VC మాట్లాడుతూ కొంత మంది యువత,విద్యార్థులు కిక్కు కోసమో,ధ్రిల్ కోసమో దమ్ము కొట్టడం,మందు కొట్టడం లాంటివి ప్రారంభించి క్రమంగా అవి ఒదులుకోలేని వ్యసనాలుగా వారికి మారుతున్నాయని అన్నారు, కొందరు ఆకతాయిలు చేసే అలవాట్ల వల్ల యువత తమ భవిష్యత్ ని నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు,డ్రగ్స్ కి అలవాటైన యువత సమాజానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని, తమ సన్నిహితులు తమ వద్దకు రావాలన్న కూడా జంకే పరిస్థితులు ఏర్పడతాయని, కాబట్టి యువత డ్రగ్స్ కి దూరంగా ఉండి సమాజానికి దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు, డ్రగ్స్ కి దూరంగా ఉందాం, సమాజంతో దగ్గరగా ఉందాం అనే స్లోగన్ తో NSF విద్యార్థి సంఘం జంగ్ సైరన్ అనే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అన్నారు, యువత మరియు వారి తల్లిదండ్రులు కూడా డ్రగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు, సరదా కోసం చేసుకునే చిన్న చిన్న అలావట్లే రేపటి రోజున మీ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేయొచ్చని,నీకు భవిష్యత్ లేకుండా చెయ్యొచ్చు, నీ కుటుంబంతో నువ్వు సమయాన్ని గడపకుండా చేయొచ్చు అని, అదే విధంగా డ్రగ్స్ తీసుకున్న వాటిని సరఫరా చేసిన మరియు వాటిని ప్రోత్సహించిన కూడా కఠిన శిక్షలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, మీకు మీ చుట్టూ ప్రక్కల డ్రగ్స్ ఉన్నట్టు ఎలాంటి అనుమానం ఉన్న కూడా పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో NSF నాయకులు నరేష్, హత్తిరామ్, అఖిల్, సూర్య కుమార్,రూప్ సింగ్,ప్రశాంత్,సంధ్య,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి