Hm9 న్యూస్ ప్రతినిధి ములుగు జిల్లా : జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు మినీ -మేడారం జాతరలోని టి. టి .డి. కళ్యాణ మండపంలొ, ఏర్పాటుచేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి ,వైద్య శిబిరానికి వస్తున్న రోగుల వివరాలను వైద్యl సిబ్బందిని అడగగా, ఈరోజు తేనెటీగలు కుట్టిన వారికి తలకు దెబ్బలు, తగిలిన వారికి , బిపి తక్కువగా ఉన్న వ్యక్తులకు, వాంతులు విరోచనాలు కలిగినవారికి మరియు ఇతరులకు మొత్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు, ఈరోజు 110 మంది కి వైద్యం అందించామని డి. ఎం. అండ్ హెచ్ .ఓ .కు తెలిపారు. మినీ జాతరల మేడారంలో ఈగలు అభివృద్ధి చెందకుండా చికెన్ మటన్ షాపుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ సిబ్బందికిl అందజేసి ఈగల అభివృద్ధి నీ నిరోధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సిబ్బంది మటన్ చికెన్ షాప్ లో యజమానులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గోపాలరావు ,నిలువ ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకునీ, ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. మేడారం జాతరకు వస్తున్న భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి తెలుపుతూ, ఆర్టీసీ బస్టాండు, జంపన్న వాగు వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను కూడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సందర్శించినారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకాంత్ డాక్టర్ యమునా,డిపి ఏమో సంజీవరావు, దుర్గారావు వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఫార్మసిస్ట్ కిరణ్, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.