మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే, అడ్వకేట్ కొమిరెడ్డి రాములు గారి సతీమణి కొమిరెడ్డి జ్యోతి గారు అనారోగ్యంతో బెంగళూరులోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జ్యోతి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సీఎంగారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.