ముమ్మరంగా కులగణన సర్వే.. ములుగు, జనగామ జిల్లాల్లో 100% పూర్తి*
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ములుగు, జనగామ జిల్లాల్లో గురువారం నాటికి వంద శాతం సర్వే పూర్తయింది. నల్గొండ జిల్లాలో 99.7 శాతం పూర్తయింది. కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. హనుమకొండ(75.7 శాతం), మేడ్చల్ మల్కాజిగిరి(71.2 శాతం) మినహా మిగతా జిల్లాల్లో 80 శాతానికి పైగా సర్వే పూర్తయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం నాటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా.. 15,17,410 నివాసాలు సర్వే పూర్తి చేసి 60.60 శాతం లక్ష్యాన్ని సాధించింది.