–రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు
-క్రీడలలో గెలుపొందిన యువకులకు బహుమతులు ప్రధానం చేసిన మాజీ వైస్ ఎంపిపి సొసైటీ చైర్మన్ మాజీ సర్పంచ్
–క్రీడలను ఉత్తేజపరిచిన చిన్నపాక రాకేష్ ను సన్మానం చేసిన గ్రామస్తులు
Hm9న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం,మండలం తిమ్మాపురం గ్రామంలో చిన్నపాక సుశీల-యాకయ్య,చిన్నపాక రాజు గార్ల జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు చిన్నపాక చంద్రకళ-రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన శెట్టల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది.ఈ క్రీడలలో గెలిచిన క్రీడాకారులకు మొదటి బహుమతి వేల్పుల అఖిల్ యాదవ్ వర్కల ప్రదీప్,రెండవ బహుమతి కొల్కనూరి రాజు,భాషబోయిన మణికంఠ, బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మాజీ వైస్ ఏంపిపి మల్లయ్య,సొసైటీ చైర్మన్ కుమారస్వామీ,మాజీ సర్పంచులు గన్ను శారదా-సంపత్,మాదినేని రాంరెడ్డి,ఉపసర్పంచ్ సారంగపాణి,బిసి సంఘం మండల అధ్యక్షులు వేల్పుల అనిల్ యాదవ్,బహుమతులు అందజేసి మాట్లాడారు.ఈ సందర్భంగా సంగెం మండల మాజీ వైస్ ఎంపిపి బుక్క మల్లయ్య మాట్లాడుతూ..యువ క్రీడాకారులు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం ఈ క్రీడా పోటీలు విజయవంతం చేసిన చిన్నపాక రాకేష్ ను గ్రామస్తులు యువకులు మహిళలు సన్మానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో కోడూరి రాజు,ఇటికాల బాబు,విరొల్ల క్రాంతికిరన్,ఇటీకాల అనిల్,కొల్కనూరి రాకేశ్,పండుగ ప్రశాంత్,ఇటీకాల కరుణానిధి,బబ్లూ,విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు