ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా గారు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ గారు ఆసక్తి కనబర్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు, ఇతర అధికారులు, హెచ్‌సీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.