ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేశారు. ప్రభుత్వం హయత్ నగర్ లో 600 చ. గజాల స్థలాన్ని కేటాయించగా, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారితో కలిసి సీఎంగారు అందించారు. స్థలం పత్రాలను అందించినందుకు ఈ సందర్భంగా కిన్నెర మొగిలయ్య గారు కృతజ్ఞతలు తెలియజేశారు.