
Hm9 న్యూస్ ములుగు జిల్లా ప్రతినిధి; ములుగు జిల్లా.జిల్లాలోని మేడారం, ఐలాపూర్, కొండాయి, మల్యాల గ్రామాల్లో జరుగుతున్న మినీ మేడారం జాతరను జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతం చేశామని, రానున్న మేడారం మహా జాతరకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శుక్రవారం ఎస్.ఎస్. తాడువాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. దర్శించుకోగా ఆలయ పూజార్లు గిరిజన సంప్రదాయ పద్ధతిలో కలెక్టర్ ఆహ్వానం పలికి గద్దెల ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐటిడిఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మినీ మేడారం జాతర ను పురస్కరించుకొని ఇప్పటివరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు అమ్మ వాళ్ళని దర్శించుకున్నారని, మినీ మేడారం జరిగే ప్రదేశాలలో మూడు లక్షలకు పైగా మంది భక్తులు అమ్మ వాళ్ళని దర్శించుకున్నారని తెలిపారు. మినీ మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులతో పాటు ప్రతి శనివారం, ఆదివారం రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, రానున్న ఆదివారాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాలం 6:00 నుండి రాత్రి 9:00 వరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మ వాళ్ళని దర్శించుకుంటున్నారని వివరించారు. మినీ మేడారం జరిగే గ్రామాలలో సైతం భక్తులకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మేడారం ఈవో రాజేందర్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎం.డి. రఫీక్, డిడబ్లూఓ శిరీష, ఐటి డి ఏ ఎస్ ఓ రాజ్ కుమార్, తహసీల్దార్లు జగదీశ్వర్, రవీందర్, సృజన్ కుమార్, పాల్గొన్నారు.