Hm9news ప్రతినిథి వరంగల్ జిల్లా : మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ప్రశ్నించే హక్కు జాతీయ తెలుగు దినపత్రిక ఆవిష్కరణ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి మానవహక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు సింగమాల వెంకట రమణయ్య ప్రారంభించడం జరిగింది సభ అధ్యక్షులుగా రాష్ట్ర చైర్మన్ డబ్బేటి శ్రీనివాస్ వ్యవహరించడం జరిగింది. ఒక కార్యక్రమానికి విశిష్టతలకు పాల్గొన్నటువంటి కాకతీయయూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య , D6 ఛానల్ నేషనల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ వరంగల్ ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశ దేవి, చైల్డ్ వెల్ఫేర్ వరంగల్ అసోసియన్ కమిటీ మెంబర్ ఆకులపెళ్లి డాక్టర్ మధు, బార్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్, ఉద్యమ విద్యార్థి నేత కాకతీయ యూనివర్సిటీ యారా బాలకృష్ణ జున్న రాజు, తెలంగాణ పోలీస్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రెసిడెంట్, శ్రీ శివాని హై స్కూల్ గోల్డ్ మెడలిస్ట్ కరస్పాండెంట్ శీలం సగిరే బాల, పాల్గొనడం జరిగింది. ప్రొఫెసర్ బన్న ఐలయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో పత్రికలు రాజకీయాలకు మానస పత్రిక లెక్క పనిచేస్తున్నాయని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని సమాజంలో తప్పుడు సమాచారాన్ని సేకరించి ఒక వ్యక్తి మీద వ్యవస్థ మీద రంగం మీద తప్పుడు వార్తలు రాసి వారి యొక్క స్థానాన్ని దిగజార్చి ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని వారు అన్నారు కాబట్టి వార్తలు రాసే ముందు ఏ పత్రిక అయినా సరే నిజం నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలి తప్ప మెప్పు కోసం రేటింగ్ కోసం ఇప్పుడు వార్తలు రాయకూడదని వారు సూచించారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను అందరికీ తెలిసే విధంగా నిజాయితీగా నీతిగా వార్తలు రాసి పత్రికలు వాటికున్న విలువలను కాపాడుకోవాలని వారు సూచించడం జరిగింది. డాక్టర్ ఆశ దేవి మాట్లాడుతూ జాతీయ మరియు రాష్ట్ర పత్రికలు వేటికవే వాటి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి నిజాలను తెలుసుకోకుండా వారి కంటికి కనబడింది నిజంగా భావించి వార్తలు రాయడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి బయటికి పంపించలేక అక్కడున్నటువంటి అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి అయితే చేస్తున్న సందర్భంలో బెడ్లు సరిపోని సమయంలో ఒక బెడ్ మీద ఇద్దరిని కూడా వంశీ ట్రీట్మెంట్ చేసి వారిని ప్రాణాలతో కాపాడటమే వారు లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారని బయటికి పంపించి ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా ఒక ఒక బెడ్ మీద ఇద్దరినీ పడుకోబెట్టి వాటి ప్రాణాలు కాపాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదని వాటిని చూసినటువంటి పత్రిక మిత్రులు తప్పుగా వార్తలు రాస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా రాయకుండా నిజాన్ని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వార్తలు రాయాలని వారుసూచించడం జరిగింది డాక్టర్ ఆకులపెల్లి మధు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రశ్నించడం అనేది లేకపోతే సమాజంలో అభివృద్ధి అనేది జరగదని ప్రశ్నించడం అనేది లేకపోతే న్యాయం అనేది జరగదు ప్రశ్నించడం అనేది లేకపోతే ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగవు ప్రశ్నించినదే ఒక వ్యవస్థ నీతి నిజాయితీలతో పని చేయదు ప్రశ్నించడం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎదిరించడం జరుగుతుంది ప్రశ్నించడం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ బెదిరించడం జరుగుతుంది ప్రశ్నించడం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ ఒక సాధారణమైన వ్యక్తి ఒక నాయకుడిగా ఎదుగుతాడని వారు అన్నారు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా పత్రికా స్వేచ్ఛను వారు పొద్దుపరచడం జరిగింది పత్రికకు స్వేచ్ఛ ద్వారానే పేద ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క సమస్యల మీద పోరాడే అవకాశం కల్పించిందని ఎక్కడైతే స్వేచ్ఛ హక్కులకు బంధం కలుగుతుందో అక్కడ పత్రికలు ఒక ఉద్యమంలో వ్యవహరించి అక్కడ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు సూచించడం జరిగింది బొమ్మల శంకర్ సంస్థ రాష్ట్ర సెక్రటరీ మాట్లాడుతూ ఈరోజు ప్రారంభమైనటువంటి జాతీయ తెలుగు దినపత్రికకు ఎన్నుకున్న పేరు ప్రశ్నించే హక్కు అంటే ఈ యొక్క పేపర్లో టైటిల్ లోనే పత్రికల యొక్క హక్కుగా భావించాలని ఇలాంటి పేరు పెట్టి పత్రికకు సాహసతమైనటువంటి నిర్ణయం తీసుకొని పత్రికా రంగంలో అడుగుపెడుతున్నటువంటి పత్రికా సంపాదకులు సింగమల వెంకటరమణయ్య వారు అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎక్కడ కూడా లంచాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నీతితో నిజాయితీతో నిబందతో వార్తలు రాసి ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా యొక్క ప్రశ్నించే హక్కు పనిచేస్తుందని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సంస్థలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర చైర్మన్ డబ్బేటి శ్రీనివాస్, నేషనల్ చైర్మన్ వెంకటరమణయ్య వారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే ఎక్కడైతే యూనిట్ గా ఉంటామో అక్కడ వారు చేసేటువంటి ఏ పనైనా సక్సెస్ అవుతుందని కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వరంగల్ జిల్లా కమిటీ కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడుతూ నిర్వహించడం జరిగిందని అలాగే జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థల్లో పని చేస్తున్నటువంటి లో గల వివిధ జిల్లాల చైర్మన్ లో సెక్రటరీలు అందరు కూడా భాగ్యసములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ చేసినారని అలాగే ఈరోజు మానవ హక్కుల రాష్ట్ర మహిళా చైర్మన్ గా హనుమకొండ నగరానికి చెందినటువంటి శ్రీమతి శీలం పల్లవి జాతీయ అధ్యక్షులు వెంకటరమణయ్య నియమించడం జరిగింది యొక్క కార్యక్రమంలో వరంగల్ జిల్లా చైర్మన్ గాలి అన్వేష్ జిల్లా సెక్రెటరీ నరసింహన్ జిల్లా వర్కింగ్ సెక్రెటరీ చిరా రాజకుమార్ హనుమకొండ జిల్లా చైర్మన్ కాగితాల శంకర్ పాల్గొనడం జరిగింది.