HM9NEWS ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండల మాజీ సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాల్సింది పోయి శాంతియుతంగా ఉద్యమిస్తున్న సర్పంచుల ఉద్యమాన్ని అణిచివేయడం, సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, అరెస్టులు చేయడం బాధాకరమని జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి, సంగెం మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండేటి బాబు, ఉపాధ్యక్షులు ఇజ్జగిరి స్వప్న అశోక్, సెక్రటరీ గుగులోతు రవి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలని, సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం వడ్డీలకు అప్పులు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలకు తెచ్చిన అప్పులు పెరిగిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లుల అమలు చేసే ప్రకటన విడుదల చేయాలని అన్నారు.