మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ రఘువీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.