Search
Close this search box.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు

 శాంతి మండల సమాఖ్య విఓఏ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ,(సెర్ఫ్) సమీక్ష సమావేశంలో

 Hm9న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల ద్వారా సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆహ్వానిస్తూ టీజీరెడ్కో ప్రకటన జారీచేసింది. ఈ సంఘాల ద్వారా పీఎం- కుసుమ్ పథకంలో భాగంగా వెయ్యి మెగావాట్లు స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ స్థలాలను ఈ సంఘాలకు లీజుకు ఇస్తారు. రైతులు సొంతంగా లేక ఏదైనా సహకార- స్వయం సహాయక సంఘం, కంపెనీ భాగస్వామ్యంతో పొలాల్లో సౌరవిద్యుత్కేంద్రాల (సోలార్ ప్లాంట్లు) ఏర్పాటుకు అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ‘ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ్ సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్’ (పీఎం కుసుమ్) కింద పొలం గట్లపై లేదా బీడుభూముల్లో ఈ కేంద్రాల ఏర్పాటుతో రైతులకు అదనంగా ఆదాయం వస్తుంది. పాల ఉత్పత్తి దారుల సొసైటీ ఏర్పాటు సర్వే, టెక్స్ టైల్స్ పార్క్ నిరుద్యోగ యువతీ యువకుల సర్వే, కిషోర్ బాలికల సంఘాలు ఏర్పాటు, కొత్త స్వయం సహాయ సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఎంటర్ప్రైజెస్, ఇతర అంశాలపై సమీక్ష సమావేశం చేయడం జరిగింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసిజిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌసల్యదేవి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌసల్య దేవి , డిఎం రేడికో మహేందర్ రెడ్డి, టి జి ఎన్ పి డి సి ఎల్ బిక్షపతి, అదనపు గ్రామీణావృద్ధి అధికారి రేణుకాదేవి, డిపిఎంలు ,సరిత, భవాని ,ఎపియం డి కిషన్, శాంతి మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణి, రాజమణి, సిసిలు సురేశ్, కుమారస్వామి,రాజయ్య, ఏలియా, కృష్ణమూర్తి, సిబ్బంది కృష్ణ, సుజాత, శివరాజు, లావణ్య, వివోఏలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి