Search
Close this search box.

మఫ్టీలో ఆకతాయిల,పోకిరీల అటకట్టిస్తున్న జిల్లా షీ టీమ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా::

బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తు విద్యార్ధినిలకు ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇద్దరు ఆకతయాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న షీ టీమ్.

*జిల్లాలో ఈ సంవత్సరం 37 కేసులు,42 పెట్టి కేసులు నమోదు చేసిన షీ టీమ్.*

*షీ టీమ్ సేవల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు.*

మహిళలు,విద్యార్థినిలు వేధింపులకు గురైనట్లు అయితే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425కు పిర్యాదు చేయండి……జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*

ఇల్లంతకుంట మండలం ప్రభుత్వ కళాశాల వద్ద కొంత మంది పోకిరీలు బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థినీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న సమాచారం మేరకు షీ టీమ్ సభ్యులకు మఫ్టీ లో కళాశాల వద్ద నిఘా ఉంచి ఇద్దరూ పోకిరీలను అదుపులోకి తీసుకొని పెట్టి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

*మహిళలను ,విద్యార్థినుల వేధించిన, వెంబడించిన సామాజిక మధ్యమాల ద్వారా వేధించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.*

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద ఉదయం,సాయంత్రం సమయంలో బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్ధినిలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా షీ టీమ్ కి సమాచారం ఇవ్వగా నిన్నటి రోజున సాయంత్రం జిల్లా షీ టీం సిబ్బంది కాలేజ్ వద్ద మఫ్టీలో ఉండగా బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ పట్టుకొని వారిపై పెట్టి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

మహిళలు మరియు చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని , జిల్లాలో విద్యసంస్థల వద్ద రద్దీగాల ప్రదేశాల్లో షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిరంతరం నిఘా ఉంచుతూ ఈ సంవత్సరం మహిళలను, విద్యార్థినులకు వేధిస్తున్న పోకిరీలపై 37 కేసులు నమోదు చేయడం జరిగిందని, 42 పెట్టి కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందని,మూడు నెలల వ్యవధిలో మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న 22 మందిని అదుపులోకి తీసుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి మరల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగిందని తెలిపారు.

*మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా జిల్లా షీ టీమ్ ని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ గారు తెలిపారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి