మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో…
ఈరోజు బిచ్కుంద మండలం కేంద్రంలోని బస్టాండ్ ఆపోజిట్ బిచ్కుంద బాన్సువాడ రోడ్డుపై గ్రామపంచాయతీ కార్మికుల తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాస్తారోకో. ఈ కార్యక్రమంలో. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ. నిరంతరం. పారిశుద్ధ కార్యక్రమం చేపట్టి గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ కార్మికులకు నెల నెలవేతనాలు ఇవ్వకపోగా. ఒక్కో గ్రామపంచాయతీలలో. ఐదు నెలల నుండి. 10 నెలల వేతనాలు ఇవ్వకపోవడం. చాలా బాధ కలిగిస్తుందని సురేష్ గొండ. ఆవేదన వ్యక్తపరిచారు. కనీసం ఇప్పటికైనా. రాష్ట్ర ప్రభుత్వం. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఈ దసరా పండగ అయినా. పెండింగ్ వేతనాలు చెల్లించాలని. అలాగే కార్మికులకు అందరికీ దసరా బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణ సమయంలో. కేంద్ర. రాష్ట్ర. ప్రభుత్వాలు కార్మికులకు. బెస్ట్ వారియర్స్ గా. ప్రకటించిన మాత్రాన. కార్మికుల పొట్ట నిండాయని కనీస వేతనం. 26 వేల వేతనం. ప్రతి కార్మికునికి. ఆరోగ్య రక్ష కార్డు. ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు. ఉద్యోగ భద్రత కల్పించాలని సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం బిచ్కుంద మండల అధ్యక్ష కార్యదర్శులు రూప్ సింగ్, సాయిలు, సుశీల బాయ్, కార్మికులు శంకర్, పురేందర్, లింగురం, భూమయ్య, లక్ష్మి, గంగవ్వ,వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు