HM9 న్యూస్ ప్రతినిథి కామారెడ్డి జిల్లా : కలెక్టర్ భూగర్భ జలాల సంరక్షణ పైన మీటింగ్ నిర్వహించారు.మన జిల్లాలో భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నాయి, రాబోయే ఎండాకాలం లో భూగర్బ జలాల సంరక్షణ కోసం ఫాంపాండ్స్, బోరేవెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ ఎక్కువ నిర్మించాలని , వచ్చే వర్ష కాలం లో ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలోకి ఇంకే లాగా దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలని సంబంధిత డిపార్ట్మెంట్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు చందర్ నాయక్ ,జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ యాదవ్, పీడీ DRDO సురేందర్ , SE ఇరిగేషన్, మున్సిపాల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారిణి జ్యోతి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది