Hm9 న్యూస్ ప్రతినిధి హనుమకొండ జిల్లా: ఐనవోలు నేడు హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్ ఆదేశాల మేరకు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించేలా మొన్న పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ మరియు ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిబ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలో నిరసన తెలుపుతుంటే అక్రమ అరెస్టు కు నిరసనగా నేడు వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఆవుల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు.అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా కాబట్టే బిజేపి అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తూ రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తూంటారు మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యింది. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తపించే కాంగ్రెస్ లక్షల, కోట్లు సార్లు అయినా డా.అంబేద్కర్ పేరు తలుస్తునే ఉంటుంది.నిత్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పుపడుతున్నారు ,స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ, నెహ్రూలను విమర్శిస్తున్నారు.అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది.రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పటికే బీజేపీపై పోరాడుతున్న కాంగ్రెస్, ఇప్పుడు అంబేద్కర్‌కు జరిగిన అవమానానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలుపుతుంది….