*బ్యాంకు అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు*
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు..
రుణమాఫీ గురించి బ్యాంకుకు వచ్చే ప్రతి రైతుకు పూర్తి వివరాలు ఇచ్చి వారికి సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరారు..
రైతుల ఆధార్ కార్డులలో ,ఖాతాల్లో దొర్లిన తప్పులను సవరించి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగేలా చూడాలని సూచించారు..
ఇది ప్రజా ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోరే ప్రభుత్వమని చెప్పారు..
అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల పట్ల తమ చిత్తశుద్ధి నిరూపించుకున్నామని తెలిపారు..
సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు రుణమాఫీ చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..
ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు మనమందరం అండగా నిలవాలన్నారు..