HM9NEWS ప్రతినిధి వరంగల్: పరకాల నియోజకవర్గంలోని సంగెం మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం హనుమకొండలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మండలంలో గ్రామాలలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు.గ్రామాలలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని,రైతుబందు,రైతుభీమ రాక,విద్యుత్ సరఫరా సరిగా లేక రైతులు కష్టాలు పడుతున్నారని,ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని,పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో గ్రామాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మండల నాయకులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.అనంతరం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాల వారీగా కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.మండల స్థాయి నాయకులు గ్రామాల్లోని కార్యకర్తలకు ఏదైనా సమస్యల ఎదురైతే పరిష్కరించాలన్నారు.అవరసరమైతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.మీకు అండగా ఎల్లప్పుడూ ఉంటానని భరోసా ఇచ్చారు.ఆరు గ్యారెంటీల హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజురై ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన వారికి బిల్లుల గురించి నాయకులు మాజీ ఎమ్మెల్యే అడగగా బిల్లుల మంజూరుపై కోర్టులో కేసు నడుస్తున్నదని,త్వరలోనే సానుకూలంగా తీర్పు వస్తున్నట్లు వారు తెలిపారు.ఈ సమావేశంలో మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.