HM9 న్యూస్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 18వ రోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి బిక్షాటన చేయడం జరిగింది తమకు కనీస వేతనాలు లేవంటూ 18 సంవత్సరాల నుంచి పనిచేసిన ప్రభుత్వం తమ సేవలను గుర్తించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని బిక్షాటన చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో, బయట సెంటర్, విద్యార్థులకు విద్యా బోధనకు తాము దూరమై సమస్యల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం అన్ని తెలిసినా తెలవనట్టు నటించడం విడ్డూరమన్నారు. ఇది నిజంగా ప్రజాపాలనైతే మహిళా ఉద్యోగులు రోడ్లను ఎక్కి భిక్షాటన ద్వారా నిరసన తెలిపిన ప్రభుత్వం యొక్క మొండ వైఖరి మానవులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను రెగ్యులర్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని అడిగారు. 30 తేదీ నాడు జరిగే క్యాబినెట్ సమావేశంలో తమ అంశాన్ని చర్చించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పైన పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమకు మద్దతు నిలిచాయని ప్రభుత్వం స్పందించకుంటే తమ సమ్మెను ఉధృతం చేసి మొత్తం విద్య వ్యవస్థను స్తంభింప చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు ,రాములు, సంతోష్ రెడ్డి,వనజ, శైలజ వీణ, లావణ్య,శ్రీవాణి,కాళిదాస్,సాయిలు,శ్రీను,రాజు, లింగం, రమేష్, సంధ్య,మాధవి మరియు 400 మంది పాల్గొన్నారు