HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా:గీసుగొండ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త దౌడు బాబు ప్రమాదవశాత్తు ఇటీవలే మరణించగా అయన భార్య శారదకి కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల భీమా చెక్కును పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం హనుమకొండలోని ఆయన నివాసంలో అందజేశారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు భీమా సదుపాయం కల్పించలేదని అన్నారు.మొదటగా బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.పార్టీ కోసం కష్టపడే కార్యకర్త అకాల మరణం చెందితే వారి కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించాలనే సదుద్దేశంతో కేసీఆర్ భీమా సదుపాయం ప్రవేశ పెట్టారని తెలిపారు.అదేవిధంగా పార్టీ పటిష్టత కోసం కృషిచేస్తున్న ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటానని,వారికి అండగా ఎల్లపుడు ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు పోలీస్ ధర్మారావు,చల్లా వేణుగోపాల్ రెడ్డి,పుండ్రు జైపాల్ రెడ్డి,గుర్రం రఘు,బోడకుంట్ల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.