ప్రొద్దుటూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు జిల్లాలోని రైతులు, కౌలు రైతు లకు సంబంధించిన పత్తిని కోనుగోలు చేసేందుకు ప్రొద్దటూరులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ ప్రాం తీయ సంయుక్త సంచాలకుడు రామాంజనేయులు తెలిపారు.
పత్తి పంటకు కనీస మద్దతు ధర పొడుగు గింజ క్వింటాల్ రూ. 7521 కాగా పొట్టి గింజ రూ. 7121గా ధర ఉందని తెలిపారు.
రైతులు తమ పత్తిని బాగా ఆరబెట్టి దుమ్ము, ధూళి లేకుండా శుభ్ర పరిచి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.
పత్తికి ప్లాస్టిక్ సంచులను వినియోగించరాదని తెలి పారు.
పత్తికి కనీస మద్దతు ధర రావాలంటే పత్తి గింజ పొడవు 29.30 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండాలన్నారు.
రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ తీసుకుని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.