HM9NEWS ప్రతినిధి ములుగు: ములుగు జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీఎస్. జె.యు)కమిటీ ఎన్నిక.గత రెండు దశబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం సంకట స్థితిలో ఉన్నప్పటికి తరుణంలో కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల జర్నలిస్టుల సమస్యలు పెరుగుతున్నాయని, అందుకోసం ప్రభుత్వ పర్యవేక్షణలో జర్నలిస్టుల సంక్షేమ పథకాలు సమర్థ వంతంగా అమలు చెయ్యాలని ఎన్.యూ.జే. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు.జర్నలిస్ట్ ఉద్యమ నిర్మాణంలో భాగంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ములుగు జిల్లా కమిటీ ఎన్నిక ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది.ఈ సందర్బంగా పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల జర్నలిస్టులు ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం చురుకుగా ముందుకు రావాలని పురుషోత్తం నారగౌని సూచించారు. ప్రభుత్వం ఒక్క జర్నలిస్టు యూనియన్ ను మాత్రమే నమ్ముకుంటే, గత ప్రభుత్వం లాగా నట్టేట మునుగుతుందని అన్నారు. ప్రభుత్వ కమిటీల లో అన్ని రిజిష్టర్డు యూనియన్ల కు భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స్థానిక పత్రికల ఎంప్యానెల్ మెంట్ వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టి.ఎస్.జే.యూ. ములుగు జిల్లా కమిటీ ఎన్నికలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికలో చల్లగురుగుల రాజు అధ్యక్షుడిగా, సంగ రంజిత్ ప్రధాన కార్యదర్శిగా ఏక గ్రీవంగా ఎన్నికైనారు. గౌరవాధ్యక్షులుగా శ్రీ పి నగేష్, ఉపాధ్యక్షులుగా ఏ నరేష్, ఎన్ హరినాధం గౌడ్, కే మహేందర్, ఎస్ కిరణ్, జాయింట్ సెక్రటరీగా పి హరీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా టి రాజు, ఎండి హజీజ్, జగన్ కే రాజు, కోశాధికారి పి. స్వామి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కవ్వంపల్లి అనిల్ కుమార్, ఆర్ కుమారస్వామి,కే రవి, ఎస్ సామరాజు, ఏ కోటి ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కమిటీ త్వరలోనే జర్నలిస్టుల సంక్షేమం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలులోకి తీసుకురావాలని అనిల్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ కార్య నిర్వాహక కార్యదర్శి పి శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ , పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.