Search
Close this search box.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు

Hm9news ప్రతినిధి. హనుమకొండ: పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా 18మరియు 19వ వార్డులో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. అనంతరం ప్రజల నుండి వచ్చే వినతులను స్వీకరించి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల మోసపూరిత మాటలు విన్న ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటే ఉన్న గూడును విప్పి పందిరి వేసుకుని జీవిస్తున్నారన్నారు.ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేలా వచ్చే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.వక్ బోర్డు ప్రాపర్టీలను కాపాడుతామని, వక్ బోర్డు నుండి పెన్షన్ నుండి పెన్షన్ ఇప్పించేలా కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తామని, ఇది మనందరి ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. ప్రతి ఇంటిలో నాలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి, త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. ఇందుకు ఇటీవల సామాజిక ఆర్థిక కులగనున చేసిందన్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత, శిథిలా వ్యవస్థలో ఉన్న ఇంటికి రెండో ప్రాధాన్యత, ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలందరికీ ఐదు సంవత్సరాలలో ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. పరకాల పట్టణ అభివృద్ధికి ప్రవేట్ కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ ను తయారుచేసామని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టబోతున్నామని అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో పెట్టి ప్రజలకు వివరించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని అన్నారు.రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నదాన సంగతి ఏ సందర్భంలో కూడా తెలియజేయలేదు అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో దరఖాస్తులు స్వీకరించి గ్రామసభలు ఏర్పాటుచేసి గ్రామాలలో ఉన్న వారికి ప్రియారిటి ప్రకారం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి