Search
Close this search box.

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి

   

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ పోలీస్ గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం తొలిసారి మడికొండ పోలీస్‌ స్టేషన్‌ ను సందర్శించారు. ఈ రోజు ఉదయం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ ముందుగా స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో ఏర్పాటు సిసి కెమెరాల కంట్రోల్‌ రూంలోని సిసి కెమెరాల పనితీరు, స్టేషన్‌లోని వివిధ రికార్డు గదులను పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని పలు రికార్డులను తనీఖీ చేయడంతో పాటు, స్టేషన్‌ పనీతీరుతో పాటు ,స్టేషన్‌ పరిధిలో ఏలాంటి నేరాలు జరుగుతాయి, ఎంత మంది రౌడీ షీటర్లు వున్నారు, రోజు ప్రమాదాల సంఖ్య, పోలీస్‌ స్టేషన్‌ పరిధి, స్టేషన్‌ సిబ్బంది మొదలైన వివరాలను ఇన్స్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్ ను పోలీస్‌ కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నిజాయితీ పనిచేయాలని, ఫిర్యాదులుపై వేగంగా స్పందించాలని, ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హన్మకొండ, హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గం వుండటం ద్వారా ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తూ చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా వుండాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు.పోలీస్‌ కమిషనర్‌ వెంట కాజీపేట ఏసిపి తిరుమల్, ఎస్. ఐ రాజ్ కుమార్ పాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు