సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
Hm9 న్యూస్ ప్రతినిధి ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.తదనంతరం ఎల్కపల్లి గ్రామంలో MGNREGS కింద పూర్తైన సీసీ రోడ్డును గ్రామ పెద్దలు శ్రీ గిరెల్లి బాపు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు జాడి తిరుపతి, మాజీ ఎంపిపి మనోహర్ గౌడ్, మాజీ సర్పంచ్లు భిక్షపతి, రాకేష్, వసీఅల్లఖాన్, భాస్కర్ రాజు, రాజారాం, దిగంబర్, తిరుపతి, శ్రీనివాస్, బాలకృష్ణ, శ్యామ్ సుందర్, మోహన్, సంతోష్, సంజీవ్, చంటి, బాపు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.