Hm9news ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉపాధి హామీ పథకంలో పొలంబాట పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు సత్కరించారు.ఉపాధి హామీ కూలీల పనిదినాలు, తది తర వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలను 100 రోజుల పనులను పూర్తి చేసుకోవాలని తెలిపారు. పనుల్లేని కూలీలకు ఉపాధి హామీ పనులు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. ఉపాధి పనులపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఉపాధి పనులు చేసే ప్రాంతంలో సౌకర్యాల కల్పన, పని వేళలు తదితర అంశాలపై కూలీలతో మాట్లాడారు.