Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో పేరుకే సిసి కెమెరాలు కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు కాదు సంవత్సరాలు గడుస్తున్న సీసీ కెమెరాలు మరమ్మతులు చేయలేదు కాకతీయ టెక్స్లి పార్క్ పనులు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు, మొరం టిప్పర్లు అతి వేగంగా వెళుతున్న క్రమంలో ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రత్యక్ష సాక్షి లేకపోతే, సీసీ కెమెరాలు పనిచేయనియెడల మాకు దిక్కు ఎవరు అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మన మండలానికి ఉపాధి కొరకు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి
పనులు చేస్తున్న క్రమంలో అందులో ఎవరైనా దొంగతనం ఆడవారి మెడలో బంగారు ఆభరణాలు, ఇంకా ఏమైనా ప్రజలకు హాని చేస్తే … ఏలా అని సీసీ కెమెరాలు ఉంటే ప్రజలకు రక్షణగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.మండల కేంద్రంలో నేరాల నియంత్రణ , ప్రజల భద్రత, కల్పించేందుకు, సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తాయి ఇవి ఏర్పాటుచేసిన ప్రాంతాలలో నేరాల సంఖ్య ఘనంగా తగ్గడం జరుగుతుంది. గ్రామాలలో నేరాలు నియంత్రణ , ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం దయచేసి మండలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా వేడుకుంటున్న.